జగన్‌కు సీసీడీ ఉంది... ఇదిగో ఆధారం
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:22 AM
‘జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్(సీసీడీ) ఉంది. దానికి ఆధారాలు ఇవిగో...’ అంటూ మంత్రి లోకేశ్ సోమవారం ఎక్స్‌లో ఒక వీడియో పోస్టు చేశారు.
ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్టు
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్(సీసీడీ) ఉంది. దానికి ఆధారాలు ఇవిగో...’ అంటూ మంత్రి లోకేశ్ సోమవారం ఎక్స్‌లో ఒక వీడియో పోస్టు చేశారు. ‘క్రెడిట్ చోరీ డిజార్డర్ లక్షణాలు ఇలా ఉంటాయి’ అంటూ వీడియో మొదలవుతుంది. గూగుల్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్, కియా, భోగాపురం విమానాశ్రయం, బల్క్ డ్రగ్ పార్క్, రెన్యూ పవర్, డైకిన్, గ్రీన్ కో ప్రాజెక్టులను నేనే తెచ్చానంటూ జగన్ క్రెడిట్ చోరీ చేయడంపై వ్యం గ్యంగా విరుచుకుపడ్డారు. ఆయా ప్రాజెక్టులు ప్రకటించిన వెంటనే వాటిని విమర్శిస్తూ మాట్లాడిన మాటలను, ప్రాజెక్టులు వచ్చిన తర్వాత వాటిని తానే తెచ్చానంటూ గొప్పలు చెప్పుకోవడాన్ని ఆ వీడియోలో చూపించారు. మధ్య మధ్యలో ‘జగన్... నవ చోరీలు...’ అంటూ కార్టూన్‌ను జత చేశారు.