వాళ్లు మాకు నీతులు చెబుతారా..?
ABN , Publish Date - Apr 03 , 2026 | 06:54 AM
అమరావతిలో అధిక వ్యయం చేస్తున్నారని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి బుధవారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమరావతిలో అధిక వ్యయం చేస్తున్నారని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి బుధవారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ‘రుషికొండ ప్యాలె్‌సకు రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు.. ఎన్‌జీటీ మాపై మరో రూ.200 కోట్లు ఫైన్ వేసింది. ఒక వ్యక్తి బతకడానికి రూ.700 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారే.. అప్పుడు వారికి అధికంగా ఖర్చుచేస్తున్నామనే ఆలోచన రాలేదా? చదరపు అడుగు రూ.4 వేలు అన్న చర్చ అప్పుడు ఏమైంది? వారు మాకు నీతులు చెబుతారా? మేం ముఖ్యమంత్రి కోసం ఇల్లు కట్టడం లేదు. రాజధాని కట్టేది వ్యక్తుల కోసం కాదు.. 5 కోట్ల ఆంధ్రుల కోసం’ అని స్పష్టం చేశారు.