Share News

మిడ్‌ డే మీల్‌ నాణ్యతపై కఠినంగా ఉండాలి: లోకేశ్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:08 AM

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా ఉండాలని మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉండవల్లిలోని ...

మిడ్‌ డే మీల్‌ నాణ్యతపై కఠినంగా ఉండాలి: లోకేశ్‌

అమరావతి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా ఉండాలని మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో సమగ్రశిక్ష అధికారులతో సమీక్షించారు. యుద్ధం నేపథ్యంలో స్టూడెంట్‌ కిట్లపై పడిన ప్రభావాన్ని అధికారులు వివరించారు. పాఠశాలల్లో క్లిక్కర్‌ ఆధారిత బోధనపై సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్‌ విధానం అమలుచేయాలని మంత్రి సూచించారు. లీప్‌ యాప్‌ను ఎంత మంది తల్లిదండ్రులు వినియోగిస్తున్నారని మంత్రి ఆరా తీశారు. ఆ యాప్‌ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలన్నారు. చిన్నకాకాని, బాపట్లలో ఆటిజం సెంటర్లు త్వరలో ప్రారంభిస్తామన్నారు.

నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగు: లోకేశ్‌

నేతన్నలకు ఉచిత విద్యుత్తు పథకంపై మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో స్పందించారు. ‘యువగళం పాద యాత్రలో హామీ ఇచ్చాను. ఇప్పుడు నిలబెట్టుకున్నాను. చేనేతల సంక్షే మం మా బాధ్యత. ఉచిత విద్యుత్తుతో నేతన్నల జీవనానికి కొత్త వెలుగు ఇస్తూ మాట నిలబెట్టుకుంది ప్రజాప్రభుత్వం’ అని పోస్టు చేశారు.

Updated Date - Apr 02 , 2026 | 04:08 AM