డబ్ల్యూఈఎఫ్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్‌తో భేటీ
ABN , Publish Date - Jan 23 , 2026 | 05:11 AM
వరల్డ్ ఎకనామిక్ ఫోరం గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మరూస్ బైౖరౌజ్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మరూస్ బైౖరౌజ్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఏడాదిలోగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం-ఏపీ సీ4 ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్)ను కార్యాచరణలోకి తీసుకురావడానికి అవసరమైన విధివిధానాలపై చర్చించారు. మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై మరూస్ సానుకూలంగా స్పందించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం-ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలెన్స్‌ను స్థాపించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో సీ4 ఐఆర్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సాధ్యమైనంత త్వరగా ఏపీలో డబ్ల్యూఈఎఫ్ సీ4 ఐఆర్‌ను స్థాపిస్తామని వెల్లడించారు.