ఢిల్లీ చేరుకున్న లోకేశ్
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:17 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ సోమవారం భేటీ కానున్నారు. ఆయన ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.
నేడు కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో భేటీ
రాజధాని బిల్లు ఆమోదంపై ధన్యవాదాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ సోమవారం భేటీ కానున్నారు. ఆయన ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రమంలో ఆయనకు టీడీపీ ఎంపీలు సాదర స్వాగతం పలికారు. లోకేశ్ వారందరినీ ఆప్యాయంగా పలకరించి రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై క్లుప్తంగా చర్చించారు. రాజధాని అమరావతికి చట్టబద్థత కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంపై సోమవారం కూటమి ఎంపీలతో రాష్ట్రపతిభవన్‌కు వెళ్లి ఆమెకు కృతజ్ఞతలు తెలుపనున్నారు.