Share News

కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధిగా పని చేయండి

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:07 AM

నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు సానా సతీశ్‌, చింతకాయల విజయ్‌, భాష్యం రామకృష్ణ తెలుగుదేశం పార్టీ..

కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధిగా పని చేయండి

  • కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో లోకేశ్‌

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు సానా సతీశ్‌, చింతకాయల విజయ్‌, భాష్యం రామకృష్ణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో వారు లోకేశ్‌ను కలిసి, తమకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ రాజ్యసభలో ప్రజల వాణిని సమర్థవంతంగా వినిపించాలని, కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధిగా నిలిచి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Updated Date - Jun 13 , 2026 | 06:08 AM