Share News

హస్తినలో లోకేశ్‌... నేడు కేంద్ర మంత్రులతో భేటీ

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:30 AM

మంత్రి లోకేశ్‌ ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, టీడీపీ ఎంపీలు లావు...

హస్తినలో లోకేశ్‌... నేడు కేంద్ర మంత్రులతో భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్‌ ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావు, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీశ్‌, మాగుంట శ్రీనివాసులురెడ్డి, జీఎం హరీశ్‌, తెన్నేటీ కృష్ణప్రసాద్‌, కేశినేని చిన్ని, శ్రీభరత్‌, బీకే పార్థసారథి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బైరెడ్డి శబరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో లోకేశ్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై కొద్దిసేపు చర్చించారు. కాగా, లోకేశ్‌ నేడు పార్లమెంటులో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - Feb 04 , 2026 | 05:30 AM