లోకేశ్ ఢిల్లీ పర్యటన
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:20 AM
మంత్రి లోకేశ్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఎంపీలు కేశినేని చిన్ని, సానా సతీశ్ సాదరంగా స్వాగతం పలికారు. ‘చార్లీ ఫాక్స్ ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్’ను మంత్రి ప్రారంభించారు.
చార్లీ ఫాక్స్‌ట్రాట్ ఏవియేషన్‌ను ప్రారంభించిన మంత్రి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఎంపీలు కేశినేని చిన్ని, సానా సతీశ్ సాదరంగా స్వాగతం పలికారు. ‘చార్లీ ఫాక్స్ ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్’ను మంత్రి ప్రారంభించారు. యువ పైలట్ క్యాడెట్‌లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ‘నా అట్లాంటా పర్యటనలో ఆలోచనగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు నిజంగా రెక్కలు తొడుగుతోంది. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగాన్ని శక్తివంతం చేయడానికి ఇదో పెద్ద ముందడుగు. యువ పైలట్ క్యాడెట్లతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం ఎంతో ఆనందాన్ని కలిగించింది. విమానయాన భవిష్యత్తుకు కొత్త ఉత్సాహం, దిశ కనిపించింది’ అని పేర్కొన్నారు.