Share News

కుశలమా బొత్సా గారు!

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:39 AM

విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇటీవల అస్వస్థతకు గురై, చికిత్స పొంది, శుక్రవారం మధ్యాహ్నం శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు.

కుశలమా బొత్సా గారు!

  • పలకరించిన మంత్రి లోకేశ్‌

అమరావతి, మార్చి6 (ఆంధ్రజ్యోతి): విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇటీవల అస్వస్థతకు గురై, చికిత్స పొంది, శుక్రవారం మధ్యాహ్నం శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. లోపలికి ఆయన రాగానే, మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు కుశల ప్రశ్న వేశారు. బాగానే ఉన్నానంటూ బొత్స సైగ చేశారు. ఆ సమయంలో ‘తల్లికి వందనం’పై మాట్లాడుతున్న మంత్రి లోకేశ్‌ ప్రసంగం ఆగి, ‘బొత్సగారూ కుశలమా? ఆరోగ్యం ఎలా ఉంది?’ అని ఆప్యాయంగా ఆరా తీశారు. ‘వెల్‌ కం బ్యాక్‌’ అంటూ స్వాగతించారు. కాగా, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుండగా, విపక్ష నేత బొత్స మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆ చర్చలో భాగంగా మాట్లాడుతూ, ఆయన తూలడంతో వైసీపీ సభ్యులు పట్టుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఆయనను బయటకు తీసుకెళ్లారు. అసెంబ్లీ వైద్యులు బీపీ చెక్‌ చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బొత్స హైదరాబాద్‌ వెళ్లినట్లు సమాచారం.

Updated Date - Mar 07 , 2026 | 04:40 AM