Share News

యర్రాజీ జ్యోతికి లోకేశ్‌ అభినందన

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:09 AM

ఆసియా క్రీడలు-2026కు అర్హత సాధించిన విశాఖపట్నంకు చెందిన ఒలింపియన్‌ జ్యోతి యర్రాజీకి మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు.

యర్రాజీ జ్యోతికి లోకేశ్‌ అభినందన

  • ఆసియా క్రీడలకు అర్హత సాధించడంపై హర్షం

అమరావతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఆసియా క్రీడలు-2026కు అర్హత సాధించిన విశాఖపట్నంకు చెందిన ఒలింపియన్‌ జ్యోతి యర్రాజీకి మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. జ్యోతి యర్రాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా.. జ్యోతిపై లోకేశ్‌ ప్రశంసలు కురిపించారు. జ్యోతి కృషి, పట్టుదల యువతకు ఆదర్శమని అన్నారు. ఫైనల్స్‌లోనూ విజయం సాధించాలని, ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశం గర్వపడేలా చేయాలని ఆకాంక్షించారు.

Updated Date - Jun 27 , 2026 | 05:10 AM