పేద ముస్లిం ఇంట..లోకేశ్ తెచ్చిన రంజాన్ సంబరం!
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:33 AM
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను మంత్రి లోకేశ్ నిలబెట్టుకున్నారు. గతేడాది పవిత్ర రంజాన్ మాసంలో చేసిన వాగ్దానాన్ని ఏడాది తిరగకముందే నెరవేర్చారు.
ఇల్లు నిర్మిస్తానని గతేడాది మంత్రి హామీ
ఏడాది తిరక్కుండానే ఇంటి నిర్మాణం పూర్తి
కృతజ్ఞతలు తెలిపిన షాహెన్‌షా కుటుంబం
మంగళగిరి సిటీ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను మంత్రి లోకేశ్ నిలబెట్టుకున్నారు. గతేడాది పవిత్ర రంజాన్ మాసంలో చేసిన వాగ్దానాన్ని ఏడాది తిరగకముందే నెరవేర్చారు. వారికి కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చి, ఆ పేద కుటుంబానికి నిజమైన పండగ తీసుకొచ్చారు. వివరాళ్లోకి వెళ్తే.. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంత్రి లోకేశ్.. గతేడాది మంగళగిరి బస్టాండు సమీపంలోని షేక్ షాహెన్‌షా అనే ఓ పేద ముస్లిం ఇంటికి అనుకోని అతిథిగా వెళ్లారు. కుటుంబసభ్యులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంలో షాహెన్‌షా నివసిస్తున్న ఇంటిని మంత్రి పరిశీలించి కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తమ పూర్వీకులు నిర్మించిన రేకుల ఇంటి స్థానంలో కొత్త ఇల్లు నిర్మించి, తమను ఆదుకోవాలని షాహెన్‌షా కుటుంబసభ్యులు లోకేశ్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఏడాది తిరగకముందే కొత్త ఇళ్లు ఇంటిని నిర్మించి, అందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని, ఆ కుటుంబానికి అండగా నిలిచారు. దీంతో షాహెన్‌షా, ఆయన కుటుంబసభ్యులు మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.