జూ. కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేస్తాం: లోకేశ్
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:28 AM
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదిక భర్తీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదిక భర్తీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుపై వైసీపీ సభ్యుడు శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరు చేయగా, అన్ని కళాశాలల్లో బోధన సిబ్బంది, 5 కళాశాలల్లో బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరు చేశామని చెప్పారు. వైసీపీ హయాంలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల ఏర్పాటుపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ప్రభుత్వ డైట్, బీఈడీ, బీపీఈడీ కళాశాలలను బలోపేతం చేస్తామని చెప్పారు. శిక్షణ కళాశాలల్లో ఖాళీలను డిప్యూటేషన్‌తో భర్తీ చేశామన్నారు.