Share News

ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చారు

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:36 AM

గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆరోపించారు.

ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చారు

  • మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విచారణ నివేదిక వచ్చాక చర్యలు: లోకేశ్‌

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆరోపించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ సిటీ ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్సిటీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని, వర్సిటీలోని వసతి గృహాలు, విభాగాల్లో పనిచేస్తున్న రోజువారీ వేతన సిబ్బంది, ఎన్‌ఎంఆర్‌, 28 రోజుల వేతన ఉద్యోగులను కనీస వేతన శ్రేణి ఉద్యోగులుగా(ఎంటీఎస్‌) పరిగణించడం, దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ విశ్వవిద్యాలయాల్లో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా వివిధ పోస్టుల్లో నియమించుకున్నారని, దానిపై ఇప్పుడు ప్రత్యేకంగా మేన్‌పవర్‌ ఆడిట్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఆడిట్‌ పూర్తిచేసి అనర్హులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్టు, ఎంటీఎస్‌ సిబ్బంది రెగ్యులరైజ్‌పై ఆడిట్‌ నివేదిక వచ్చాక ఫైనాన్స్‌తో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవకతవకలపై విచారణ జరుగుతోందని, ఆ నివేదిక 45 రోజుల్లో వస్తుందని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ చెప్పారు. ఆంధ్రావర్సిటీ ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ ర్యాంకింగ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 41వ ర్యాంకుకు తెచ్చామని, ఇప్పుడు టాప్‌-10లోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. శనివారం విశాఖ పర్యటనలో వీసీని కలిసి వందేళ్ల ఉత్సవాల నిర్వహణపై చర్చిస్తానన్నారు. మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నామని, ఇప్పటివరకు 1.48 కోట్ల సేవలు అందించామని లోకేశ్‌ తెలిపారు. మనమిత్ర వాట్సాప్‌ సేవలపై శాసనసభలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ మనమిత్ర ఫ్లాట్‌ఫాంపై ఎలాంటి డేటా స్టోర్‌ చేయడం లేదన్నారు. మనమిత్ర యాప్‌ను యూజర్‌ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

Updated Date - Feb 28 , 2026 | 05:36 AM