Share News

వైసీపీ పాలనలో విధ్వంసకర ఘటనలు: కొండపల్లి

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:09 AM

‘వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై ఎన్నో విధ్వంసకర ఘటనలు జరిగాయి. ఒక్క దానిలో కూడా దోషులను పట్టుకోలేకపోయారు’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

వైసీపీ పాలనలో విధ్వంసకర ఘటనలు: కొండపల్లి

విజయనగరం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై ఎన్నో విధ్వంసకర ఘటనలు జరిగాయి. ఒక్క దానిలో కూడా దోషులను పట్టుకోలేకపోయారు’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఉదయం రామతీర్థంలోని కోదండ రాముడిని దర్శించుకున్న అనంతరం ధ్వంసమైన విగ్రహాలను కోటిపల్లి వద్ద గోదావరిలో నిమజ్జనానికి తీసుకొని వెళ్తున్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన ఘటనలను రాష్ట్ర ప్రజలు, భక్తులు మర్చిపోరన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, ఎన్‌ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 06:10 AM