ఇరాన్ నుంచి త్వరగా వచ్చేయండి
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:07 AM
ఇరాన్‌లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో అక్కడున్న రాష్ట్ర విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రవాసాంధ్రులు క్షేమంగా స్వస్థలాలకు...
ప్రవాసాంధ్రులకు మంత్రి కొండపల్లి సూచన
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఇరాన్‌లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో అక్కడున్న రాష్ట్ర విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రవాసాంధ్రులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని రాష్ట్ర ప్రవాసాంధ్రుల సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అక్కడి భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు భారత ఎంబసీ, ఏపీఎన్‌ఆర్టీలను సంప్రదించి త్వరితగతిన స్వస్థలాలకు చేరుకోవాలన్నారు. సాయం కోసం ఏపీఎన్‌ఆర్టీ హెల్ప్‌లైన్ నంబరు +91 8500027678ను సంప్రదించాలన్నారు.