మనుగడ కోసమే వైసీపీ కాపు నేతల మీటింగులు
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:38 AM
రాజకీయ మనుగడ కోసమే వైసీపీలోని కాపు నాయకులు బ్రేక్‌ఫాస్ట్ మీటింగులు, ఫంక్షన్ హాళ్లలో సమావేశాలు పెట్టుకుంటున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు.
భవిష్యత్ లేదన్న భయంతో కొత్త నాటకాలు: మంత్రి కొండపల్లి
అమరావతి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాజకీయ మనుగడ కోసమే వైసీపీలోని కాపు నాయకులు బ్రేక్‌ఫాస్ట్ మీటింగులు, ఫంక్షన్ హాళ్లలో సమావేశాలు పెట్టుకుంటున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి పాలనలో కాపులు సంతృప్తిగా ఉన్నందున.. తమకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయంతోనే కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో కొత్త నాటకాలకు తెరలేపారని మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కాపులకు ఏం చేశారో చెప్పగలరా అని మంత్రి కొండపల్లి సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు.