Share News

వైసీపీది ఫ్యాక్షన్‌ భావజాలం

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:40 AM

సమకాలీన రాజకీయ అంశాలపై ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ విశ్లేషణ బాగుంటుందని..సమాజ శ్రేయస్సు కోసమే ఆయన వారాంతపు కామెంట్స్‌ రాస్తుంటారని...

వైసీపీది ఫ్యాక్షన్‌ భావజాలం

  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’కి బెదిరింపులు తగవు: మంత్రి కొండపల్లి

విజయనగరం, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): సమకాలీన రాజకీయ అంశాలపై ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ విశ్లేషణ బాగుంటుందని..సమాజ శ్రేయస్సు కోసమే ఆయన వారాంతపు కామెంట్స్‌ రాస్తుంటారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా తప్పొప్పులను రాధాకృష్ణ చూపుతుంటారని, అందులో మంచి చెడులను తీసుకొని సరిచేసుకోవాలే తప్ప ఆయన్ను నిందించడం తగదని హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వస్తే ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ లేకుండా చేస్తామంటున్నారని, అది ఫ్యాక్షన్‌ భావజాలమని విమర్శించారు. అసలు వైసీపీ అధికారంలోకి రావాలి కదా అని ఎద్దేవా చేశారు.

Updated Date - Apr 13 , 2026 | 06:42 AM