రాజధానిపై ఆలోచన లేకపోవడం దురదృష్టం: కొండపల్లి
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:12 AM
సీఎంగా రాష్ర్టాన్ని పాలించిన జగన్‌కు రాజధాని విషయంలో సరైన ఆలోచన లేకపోవడం దురదృష్టకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
విజయనగరం, జూలై 2(ఆంధ్రజ్యోతి): సీఎంగా రాష్ర్టాన్ని పాలించిన జగన్‌కు రాజధాని విషయంలో సరైన ఆలోచన లేకపోవడం దురదృష్టకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునతో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘అభివృద్ధిని డైవర్ట్ చేయడానికే జగన్ ఇలా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ పేరుతో వెళ్లడం తప్పులేదు. దానికి కూడా ప్రజలే సరైన ఫలితాలు ఇస్తారు. కచ్చితంగా అమరావతే గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.