Share News

పారిశ్రామికవర్గాల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:10 AM

పారిశ్రామిక వర్గాలకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎంఎ్‌సఎంఈ, సెర్ప్‌...

పారిశ్రామికవర్గాల సమస్యల పరిష్కారానికి కృషి

  • చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులకు మంత్రి కొండపల్లి హామీ

అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక వర్గాలకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎంఎ్‌సఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ (ఏపీ చాంబర్స్‌) అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర సచివాలయంలోని కార్యాలయంలో మంత్రిని కలిసి ఇంజనీరింగ్‌, ఎంఎ్‌సఎంఈ రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపింది. ఎంఎ్‌సఎంఈలు పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగించేలా ప్రోత్సహించేందుకు స్థిరమైన, పరిశ్రమలకు అనుకూలమైన విధానాన్ని తీసుకురావాలని ఏపీ చాంబర్స్‌ ప్రతినిఽధులు మంత్రిని కోరారు. వీటిపై మంత్రి కొండపల్లి సానుకూలంగా స్పందించారు.

Updated Date - Feb 20 , 2026 | 03:10 AM