మంత్రి కొండపల్లికి అంతర్జాతీయ అవార్డు
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:56 AM
రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు అంతర్జాతీయ పురస్కారం లభించింది.
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం పనిచేస్తున్న యూఎస్ -ఇండియా ఎస్‌ఎంఈ కౌన్సిల్ ఈ అవార్డును ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడి పేరుతో ఇచ్చే ‘ది ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డు’ను యూఎస్ -ఇండియా ఎస్‌ఎంఈ కౌన్సిల్ సీఈవో ఎలీషా బి.పులివర్తి.. మంత్రికి అందజేశారు.