Share News

జగన్‌ అబద్ధాలు చెప్పినా నంబర్లు నిజాలే చెప్తాయి

ABN , Publish Date - Jun 26 , 2026 | 06:39 AM

జగన్‌ అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలనుకున్నా... నంబర్లు ఎప్పుడూ నిజాలే చెప్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. జగన్‌ చేసిన ట్వీట్‌కు ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు.

జగన్‌ అబద్ధాలు చెప్పినా నంబర్లు నిజాలే చెప్తాయి

  • జగన్‌ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కొండపల్లి

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): జగన్‌ అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలనుకున్నా... నంబర్లు ఎప్పుడూ నిజాలే చెప్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. జగన్‌ చేసిన ట్వీట్‌కు ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. 2020-21లో స్వయం సహాయక సంఘాల కోసం ఆర్బీఐ కొల్లేటరల్‌ ఫ్రీ రుణపరిమితిని పెంచే ముందు.. ఏపీలో స్వయం సహాయక సంఘాలపై బ్యాంకు రుణాల నిల్వ రూ.30,644 కోట్లుగా ఉంటే... 2023-24 నాటికి రూ.90,771 కోట్లుగా ఉంది. ఏపీలో ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు రుణాల నిల్వలు అనూహ్యంగా పెరిగాయి. అదంతా కూటమి ప్రభుత్వ ఘనతే. ఈ విషయం జగన్‌ తెలుసుకోవాలి. ఎన్ని అబద్ధాలు చెప్పినా చరిత్ర ఎప్పుడూ నిజమే చెప్తుంది’ అని కొండపల్లి పేర్కొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 06:40 AM