కూటమికి మరక అంటించే ప్రయత్నం..: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:24 AM
‘అప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసును రాజకీయం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెట్టాలని చూశారు. ఇప్పుడేమో దస్తగిరి హత్యపై అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘అప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసును రాజకీయం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెట్టాలని చూశారు. ఇప్పుడేమో దస్తగిరి హత్యపై అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘దస్తగిరిని వైసీపీ వారే చంపి, కూటమి ప్రభుత్వానికి మరక అంటించాలని చూస్తున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారాన్ని ఆస్వాదించారు. అవినీతికి పాల్పడ్డారు. సొంత ఆస్తులు పెంచుకున్నారు... అంతే తప్ప ఉత్తరాంధ్రకు, ప్రజలకు ఏమీ చేయలేదు’ అని మంత్రి విమర్శించారు.