కోనసీమలో ఎంఎస్ఎంఈ పార్కులు: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:43 AM
కోనసీమ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
కోనసీమ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు కోసం భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే బండారు సత్యానంతరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రైవేట్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సెంటర్లు (ఎఫ్‌ఎఫ్‌సీ) ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి కొండపల్లి వివరించారు.