Share News

అధ్యాపకుల వేధింపులపై మంత్రి కొలుసు ఆరా

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:53 AM

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినులను కొంతమంది అధ్యాపక సిబ్బంది వేధిస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం వచ్చిన వార్తపై రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు.

అధ్యాపకుల వేధింపులపై మంత్రి కొలుసు ఆరా

నూజివీడు, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినులను కొంతమంది అధ్యాపక సిబ్బంది వేధిస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం వచ్చిన వార్తపై రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. దీనిపై ఆరాతీశారు. గతంలోనే కొంతమంది సిబ్బందిని మార్చాలని చెప్పినప్పటికీ ఎందుకు మార్చలేదని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ గోపాల్‌రాజును ఫోన్‌లో ప్రశ్నించారు. తాను కొద్ది రోజుల క్రితమే ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించానని, విషయాన్ని వైస్‌ ఛాన్సలర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. వేధింపులపై విచారణ జరుగుతున్నట్టు వివరించారు.

Updated Date - Apr 14 , 2026 | 05:54 AM