వైసీపీని పట్టించుకోనవసరం లేదు: మంత్రి కొలుసు
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:31 AM
‘వైసీపీ నేతలు బయటకు వచ్చి వీరంగం వేయాలని చూస్తున్నా వారు కూటమి నాయకుల వెంట్రుకలు కూడా పీకలేరు’ అని మంత్రి కొలుసు పార్థసారథి ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఏలూరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ నేతలు బయటకు వచ్చి వీరంగం వేయాలని చూస్తున్నా వారు కూటమి నాయకుల వెంట్రుకలు కూడా పీకలేరు’ అని మంత్రి కొలుసు పార్థసారథి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏలూరులో శుక్రవారం జరిగిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి, ఇతర కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అమరావతి రాజధాని, వైద్య కళాశాలల నిర్మాణాలకు కనీసం రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని వైసీపీ... ఇప్పుడు నానా యాగీ చేస్తోంది. ఆ పార్టీ కూటమి పాలనపై చేస్తున్న బురద రాజకీయాలను పట్టించుకోనవసరం లేదు’ అని మంత్రి సూచించారు.