సజ్జల వ్యాఖ్యలు హాస్యాస్పదం: మంత్రి కొలుసు
ABN , Publish Date - Jul 04 , 2026 | 04:42 AM
వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిపై అవాకులు, చెవాకులు పేలడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిపై అవాకులు, చెవాకులు పేలడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ‘మీ దృష్టిలో రాష్ట్రాన్ని నిలబెడితే విలన్.. జేసీబీలతో కూల్చేస్తే హీరోలా? సీఎం చంద్రబాబు విలన్ ఎలా అయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అమరావతి అజేయంగా, శాశ్వతంగా నిలబడుతుంది’’ అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.