Share News

తాటాకు చప్పుళ్లకు బెదరం

ABN , Publish Date - May 27 , 2026 | 04:37 AM

రాష్ట్రాభివృద్ధిని ఆటంకపరిచేలా వైసీపీ చేస్తున్న బెదిరింపులు, తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తి లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

తాటాకు చప్పుళ్లకు బెదరం

  • వచ్చేది మేమేనంటూ వైసీపీ పగటి కలలు: మంత్రి పార్థసారథి

నూజివీడు, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధిని ఆటంకపరిచేలా వైసీపీ చేస్తున్న బెదిరింపులు, తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తి లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ‘నవ్యాంధ్రను అభివృద్ధి పథంవైపు నడిపేందుకు సీఎం చంద్రబాబు పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉద్యోగ కల్పన దిశగా అడుగులు వేస్తున్నా రు. దానిని ఆటంకపరిచే విధంగా వైసీపీ కుయుక్తులు పన్నుతోంది. వచ్చేది తామేనని పగటి కలలుకంటోంది. రాజారెడ్డి పేరును బయటకు తెస్తున్న జగన్‌రెడ్డి తన కుటుంబ చరిత్రను తానే బయట పెట్టుకున్నారు’ అని మంత్రి అన్నారు.

Updated Date - May 27 , 2026 | 04:37 AM