ఇళ్ల కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు: మంత్రి కొలుసు
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:44 AM
గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులు తీసుకుని వాటిని కట్టకుండా వదిలేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని...
గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులు తీసుకుని వాటిని కట్టకుండా వదిలేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ వారికి తీరని అన్యాయం చేశారని తెలిపారు. పేదల ఇళ్లను పూర్తి చేయడంతోపాటు లే-అవుట్లలో రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్తు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.