కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలి: కొల్లు
ABN , Publish Date - Mar 14 , 2026 | 06:04 AM
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
ఎక్సైజ్ ఎస్సైలకు నియామక పత్రాల పంపిణీ
విజయవాడ(భారతీనగర్), మార్చి 13(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న ఎక్సైజ్ ఎస్సైలు ఉద్యోగ నిర్వహణలో నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలని కోరారు. నూతనంగా ఎంపికైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు విజయవాడలో శుక్రవారం రాత్రి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రానున్న కాలంలో 20లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అనంతరం ఎక్సైజ్ శాఖలో నూతనంగా ఎంపికైన 150 మందికి నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాధిపతి రాహుల్ దేవ్ శర్మ అదనపు కమిషనర్ అనసూయదేవి, అధికారులు పాల్గొన్నారు.