జగన్‌కు ఇంకా సిగ్గు రాలేదు: మంత్రి కొల్లు
ABN , Publish Date - May 22 , 2026 | 06:01 AM
వైసీపీకి 11 సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపినా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు మాత్రం ఇంకా సిగ్గు రాలేదని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
కర్నూలు అర్బన్, మే 21(ఆంధ్రజ్యోతి): వైసీపీకి 11 సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపినా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు మాత్రం ఇంకా సిగ్గు రాలేదని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం 24 నెలల్లో వంద శాతం అభివృద్ధి, సంక్షేమం అమలు చేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హమీలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందాం. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి వైఎస్ జగన్ ఓర్చుకోలేకనే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. విశ్వనీయత గురించి జగన్ రెడ్డి మాట్లాడటం హస్యాస్పదంగా ఉంది. అమరావతిని నాశనం చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ నిర్వీర్యం చేశాడు. అభివృద్ధి గురించి ఆయన మాట్లాడటం సిగ్గుచేటు’ అని మంత్రి కొల్లు మండిపడ్డారు.