జగన్‌రెడ్డి డైరెక్షన్‌లోనే విమర్శలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:32 AM
మాజీ సీఎం జగన్ డైరెక్షన్‌లోనే అంబటి రాంబాబు, జోగి రమేశ్, పేర్ని నాని పరుష పదజాలం తో టీడీపీ నాయకులను తిడుతున్నారు. అని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
వంగవీటికి, రాంబాబుకు పోలికే లేదు: మంత్రి కొల్లు
మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం జగన్ డైరెక్షన్‌లోనే అంబటి రాంబాబు, జోగి రమేశ్, పేర్ని నాని పరుష పదజాలం తో టీడీపీ నాయకులను తిడుతున్నారు.’ అని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ‘సీఎం చంద్రబాబును సైతం ఇష్టారాజ్యంగా దుర్భాషలాడిన అంబటి రాంబాబును రెండో వంగవీటి రంగాగా పోల్చడం విడ్డూరంగా ఉంది. వంగవీటి రంగాకు, అంబటి రాంబాబుకు ఏవిధమైన పోలికా లేదు. పందికొక్కులా పేదల బియ్యాన్ని బొక్కేసిన పేర్ని నాని నీతులు వల్లిస్తున్నాడు. కల్తీ మద్యంతో వేలాది ప్రజల ప్రాణాలు తీసిన జోగి రమేశ్ తాను బీసీనని చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని మంత్రి కొల్లు అన్నారు.