Minister Kolla Ravindra: వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు!
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:32 AM
హత్యా రాజకీయాలకు.. కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం విరుద్ధమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పల్నాడు ఘటనకు రాజకీయం....
జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): హత్యా రాజకీయాలకు.. కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం విరుద్ధమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పల్నాడు ఘటనకు రాజకీయం చేసే ప్రయత్నం దురదృష్టకరమని, వ్యక్తిగత గొడవలకు కుల, రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్నాడులో వైసీపీ ఐదేళ్ల పాలనలో హింస, దౌర్జన్యాలు రాజ్యమేలాయన్నారు.. పిన్నెల్లి సోదరుల అరాచకాలు.. వైసీపీ దాష్టీకానికి నిదర్శనాలని పేర్కొన్నారు. కుట్ర రాజకీయాలే వైసీపీ పతనానికి కారణమన్న విషయాన్ని విస్మరించి మళ్లీ అవే రాజకీయాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. కుట్రలు చేసేవారు ఎవరైనా.. ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టంచేశారు.