జగన్ మాట్లాడేవన్నీ అబద్ధాలే: మంత్రి జనార్దన్‌రెడ్డి
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:55 AM
జగన్ జీవితం జంగిల్ బుక్‌లా మారిందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): జగన్ జీవితం జంగిల్ బుక్‌లా మారిందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అబద్ధాలు తప్ప ఏనాడూ వాస్తవాలు మాట్లాడని వ్యక్తి జగన్. ప్రజాతీర్పును గౌరవించి అసెంబ్లీకి రాకుండా బయట కూర్చుని విమర్శలు చేయడం ఏమిటి? అధికారంలో ఉన్న సమయంలో ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్, హెచ్‌ఎ్‌సబీసీ, ఐబీఎం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను రాష్ట్రం నుంచి తరిమేసిన ఘనత జగన్‌దే’ అని జనార్దన్‌రెడ్డి విమర్శించారు.
రాజకీయంగా, వ్యక్తిగతంగా ఒంటరైన జగన్: వర్ల
ఐదేళ్లు రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని నిరంకుశంగా పాలించిన జగన్ పరిస్థితి నేడు కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజలు ఛీకొట్టడంతో రాజకీయంగా ఒంటరివాడైన జగన్... ఆస్తుల విషయంలో తల్లి విజయమ్మ రాసిన లేఖతో వ్యక్తిగతంగానూ ఒంటరి అయ్యాడు. సొంత కుటుంబ సభ్యులకే రక్షణ ఇవ్వలేని జగన్ ఇక రాష్ట్ర ప్రజలకు ఏం రక్షణ ఇస్తారు?’ అని వర్ల ప్రశ్నించారు.