Share News

‘జువ్వెలదిన్నె’పై జగన్‌ దుష్ప్రచారం: మంత్రులు

ABN , Publish Date - Mar 14 , 2026 | 03:53 AM

జువ్వల దిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రైవేటుపరం చేస్తున్నామని ఎవరు చెప్పారని మాజీ సీఎం జగన్‌పై మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

‘జువ్వెలదిన్నె’పై జగన్‌ దుష్ప్రచారం: మంత్రులు

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): జువ్వల దిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రైవేటుపరం చేస్తున్నామని ఎవరు చెప్పారని మాజీ సీఎం జగన్‌పై మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జువ్వలదిన్నె జగన్‌ కుట్రలు చేస్తున్నారని శుక్రవారం సచివాలయంలో ఆరోపించారు. ‘రాష్ట్రంలో దాదాపు రూ.2500-3000 వేల కోట్ల పెట్టుబడితో సాగర్‌ డిఫెన్స్‌ పరిశ్రమ రాబోతోంది. మత్స్యకారులకు ఆధునిక కమ్యూనికేషన్‌, వాతావరణ సమాచారం అందించే లక్ష్యంతో 114 ఎకరాల హార్బర్‌ భూమిలో 7ఎకరాలను తీరం అనుసంధానం, టెక్నాలజీ కోసం సాగర్‌ డిఫెన్స్‌కు ఇస్తున్నాం. మిగిలిన 22 ఎకరాలు ఆ సంస్థకు బయటే ఇచ్చాం. అయితే దీనిని ప్రైవేటుపరం చేస్తున్నారని వైసీపీ, జగన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తూ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. జువ్వలదిన్నెను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం ఇస్తాం’ అని జనార్దనరెడ్డి తెలిపారు

Updated Date - Mar 14 , 2026 | 03:55 AM