జగన్ వీరపిచ్చోడు: మంత్రి గుమ్మిడి
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:27 AM
‘వైసీపీ అధినేత జగన్‌కు అమరావతి అంటే ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం లేదు. తల్లి, చెల్లి అంటే గౌరవమే లేదు.
పార్వతీపురం/సాలూరు, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ అధినేత జగన్‌కు అమరావతి అంటే ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం లేదు. తల్లి, చెల్లి అంటే గౌరవమే లేదు. పిచ్చోళ్లను చాలామందిని చూశాను. కానీ జగన్ లాంటి వీర పిచ్చోడిని ఎక్కడా చూడలేదు’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో శ్రేణులతో సమావేశమై మాట్లాడారు. సాలూరు పట్టణ నడిబొడ్డున సుభాశ్ చంద్రబోస్ విగ్రహం ఉంటే దానిని అవమానపరిచేలా వైఎ్‌సఆర్ విగ్రహం పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.