Share News

చెల్లిపై సొంత మీడియాలో ప్రచారం చేయించిన దుర్మార్గుడు జగన్‌: మంత్రి గుమ్మిడి

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:09 AM

‘చెల్లి షర్మిల... తన నాన్నకు పుట్టలేదని సొంత మీడియాలో ప్రచారం చేయించిన దుర్మార్గుడు జగన్మోహన్‌రెడ్డి’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు.

చెల్లిపై సొంత మీడియాలో ప్రచారం చేయించిన దుర్మార్గుడు జగన్‌: మంత్రి గుమ్మిడి

సాలూరు, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ‘చెల్లి షర్మిల... తన నాన్నకు పుట్టలేదని సొంత మీడియాలో ప్రచారం చేయించిన దుర్మార్గుడు జగన్మోహన్‌రెడ్డి’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో పీఎం సూర్యఘర్‌ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ‘చెల్లికి, తల్లికి, చిన్నాన్న కూతురికి విలువ ఇవ్వని, న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏం న్యాయం చేయగలడు? ఆంధ్రజ్యోతిపై, ఎండీ రాధాకృష్ణపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆయన మూర్ఖత్వానికి పరాకాష్ఠ’ అని మంత్రి గుమ్మిడి అన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 06:09 AM