దమ్ముంటే అసెంబ్లీకి రావాలి: మంత్రి గుమ్మిడి
ABN , Publish Date - Feb 03 , 2026 | 06:31 AM
పవిత్రమైన తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని మళ్లించేందుకే వైసీపీ నేతలు దిగజారుడు భాష మాట్లాడుతున్నారు.
అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ‘పవిత్రమైన తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని మళ్లించేందుకే వైసీపీ నేతలు దిగజారుడు భాష మాట్లాడుతున్నారు. జగన్... డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి దమ్ముంటే అసెంబ్లీకి రావాలి’ అపి మంత్రి సంధ్యారాణి సవాల్ విసిరారు. ‘క్లీన్ చిట్ అంటే ఏమిటో చంద్రబాబును చూసి వైసీపీ నేర్చుకోవాలి.’ అని మంత్రి గుమ్మిడి అన్నారు. కాగా, రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరికీ విద్య, వైద్యం, ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ ఎస్టీ సెల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.