మావిగన్‌తో వైసీపీ భూస్థాపితమే: మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:09 AM
శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై జగన్ కక్ష కట్టాడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై జగన్ కక్ష కట్టాడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ 2024 ఎన్నికలకు ముందు మూడు రాజధానులన్నాడని ప్రజలు 11 సీట్లతో సరిపెట్టారు. ఈసారి మావిగన్‌తో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం. ఓ సిద్ధాంతం, విధానం లేని వైసీపీ... గొడ్డలినే నమ్ముకొని రాజకీయాలు చేస్తోంది’ అని విమర్శించారు.