Share News

అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైసీపీ: గొట్టిపాటి

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:43 AM

‘అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైసీపీ. తిరుమల కల్తీ నెయ్యి అంశంలో ఆ పార్టీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోంది’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు.

అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైసీపీ: గొట్టిపాటి

భీమవరం టౌన్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ‘అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైసీపీ. తిరుమల కల్తీ నెయ్యి అంశంలో ఆ పార్టీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోంది’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మునిసిపల్‌ కార్యాలయం వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘తిరుమలకు ఉన్న అపార గౌరవాన్ని భ్రష్టుపట్టించిన ఘనత వైసీపీదే. టీటీడీకి డిక్లరేషన్‌ సమర్పించే సంప్రదాయాన్ని జగన్‌ తుంగలో తొక్కారు. 70 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన వ్యక్తి ఆయనే. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడూ జగన్‌రెడ్డే’ అంటూ మండిపడ్డారు.

Updated Date - Feb 01 , 2026 | 04:44 AM