విద్యుత్ చార్జీలు ట్రూ డౌన్ చేశాం
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:39 AM
దేశ చరిత్రలో విద్యుత్ చార్జీలను ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, యూనిట్‌కు 13 పైసలు ట్రూ డౌన్ చేశామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
వచ్చే మూడేళ్లలో చార్జీలు మరింత తగ్గిస్తాం
రూ.1.19 తగ్గించి యూనిట్ రూ.4కే ఇస్తాం: మంత్రి గొట్టిపాటి
గుంటూరు తూర్పు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): దేశ చరిత్రలో విద్యుత్ చార్జీలను ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, యూనిట్‌కు 13 పైసలు ట్రూ డౌన్ చేశామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, వచ్చే మూడేళ్లలో యూనిట్ చార్జీ రూ.1.19 వరకు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గుంటూరులో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు అందిస్తే రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు యూనిట్ విద్యుత్ చార్జీ రూ.5.19 ఉండేదని, అందులో 29పైసలు తగ్గించామని, మరో 90పైసలు తగ్గింపునకు చర్యలు చేపట్టామని అన్నారు. వచ్చే మూడేళ్లలో యూనిట్ చార్జీ రూ.4కు తగ్గించేలా చర్యలు చేపట్టామని తెలిపారు.