Share News

విద్యుత్తు అంతరాయాలు ఉండొద్దు: గొట్టిపాటి

ABN , Publish Date - May 03 , 2026 | 05:18 AM

వేసవిలో ఎంత డిమాండ్‌ ఉన్నా విద్యుత్తు అంతరాయాలు ఉండటానికి వీల్లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులకు స్పష్టం చేశారు.

విద్యుత్తు అంతరాయాలు ఉండొద్దు: గొట్టిపాటి

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): వేసవిలో ఎంత డిమాండ్‌ ఉన్నా విద్యుత్తు అంతరాయాలు ఉండటానికి వీల్లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులకు స్పష్టం చేశారు. అకాల వర్షాలు, అధిక వేడి వల్ల తాత్కాలిక విద్యుత్తు సమస్యలు తలెత్తినా వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యుత్తు సంస్థల సీఎండీలతో మంత్రి టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. విద్యుత్తు సరఫరా పరిస్థితిని సమీక్షించారు. అధికారికంగా లేదా అనధికారికంగా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్తు అంతరాయాలు ఉండటానికి వీల్లేదని మంత్రి ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉంటూ, అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

Updated Date - May 03 , 2026 | 05:19 AM