న్యాయవాదుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఫరూక్
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:08 AM
రాష్ట్రంలోని న్యాయవాదుల రక్షణకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ చెప్పారు.
రాష్ట్రంలోని న్యాయవాదుల రక్షణకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ చెప్పారు. అమరావతి సచివాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా బార్ ఫెడరేషన్, ఒంగోలు బార్ అసోసియేషన్, హిందూ లాయర్స్ ఫోరం, ఇతర లాయర్ల బృందాలు బుధవారం మంత్రి ఫరూక్‌ను కలిసి, న్యాయవాదుల రక్షణ బిల్లు, న్యాయమిత్ర, అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్, హెల్త్ కార్డులు తదితర పథకాలను అమలు చేయాలని కోరారు. ఇదిలావుంటే, కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్‌ను దర్గా ప్రతినిధులు ఆహ్వానించారు. బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి ఫరూక్‌ను దర్గా ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకూ జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని మంత్రిని కోరారు. ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను వారిని అడిగి మంత్రి తెలుసుకున్నారు.