ఆంధ్రను సినీ కేంద్రంగా మారుస్తాం: దుర్గేశ్
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:14 AM
సినిమా రంగానికి ఏపీ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. బుధవారం అసెంబ్లీ లో పర్యాటక శాఖకు సంబంధించి .....
సినిమా రంగానికి ఏపీ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. బుధవారం అసెంబ్లీ లో పర్యాటక శాఖకు సంబంధించి రూ.294 కోట్ల బడ్జెట్ ఆమోదించాలని కోరుతూ ప్రతిపాదించారు. ‘సినిమాటోగ్రఫీ ద్వారా పర్యాటక అభివృద్ధికి ఫిల్మ్ టూరిజం పాలసీ తెచ్చాం. ఏపీలో రిజిస్టర్ అయిన చిన్న పరిశ్రమల కు 9 శాతం జీఎస్టీ మినహాయింపు ఇస్తున్నాం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రా మా ప్రాంతీయ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో నంది అవార్డులను అందించే ఆలోచన చేస్తున్నాం. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ కృషి చేస్తున్నారు. త్వరలో సీఎం చంద్రబాబు ఆమోదంతో నంది అవార్డుల ప్రకటన చేస్తాం. పర్యాటక ఉత్సవాల నిర్వహణకు రూ.150 కోట్లు కేటాయించాలని, విశాఖలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు కేంద్రాన్ని కోరాం.’ అని పేర్కొన్నారు.