Share News

మారీచుడు వేషం మార్చినట్లు రాజధానిపై మాట మార్పు

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:13 AM

మారీచుడు వేషం మార్చినట్లుగా రాజఽధాని అమరావతిపై జగన్‌ మాట మారుస్తున్నారని మంత్రి డీఎ్‌సబీవీ స్వామి మండిపడ్డారు.

మారీచుడు వేషం మార్చినట్లు రాజధానిపై మాట మార్పు

  • మానసిక పరిపక్వత లేని మనిషి జగన్‌: మంత్రి స్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): మారీచుడు వేషం మార్చినట్లుగా రాజఽధాని అమరావతిపై జగన్‌ మాట మారుస్తున్నారని మంత్రి డీఎ్‌సబీవీ స్వామి మండిపడ్డారు. ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రం-1 వద్ద గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘మానసిక పరిపక్వత లేని పిచ్చోడిలా జగన్‌ మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు చూసి చిన్నపిల్లలు సైతం నవ్వుకుంటున్నారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు వెళ్లిపోయాయి. గత ఎన్నికల ముందు వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయకుండానే జాతికి అంకితం చేశారు. కానీ ఆ ప్రాజెక్టు ఎవరి హయాంలో పూర్తవుతుందో, నిర్వాసితులకు పరిహారం ఎవరు ఇస్తున్నారో ప్రజలందరికీ తెలుసు’ అని స్పష్టం చేశారు.

Updated Date - Jul 03 , 2026 | 05:14 AM