రక్త చరిత్రకు మారు పేరు వైఎస్ కుటుంబం
ABN , Publish Date - May 22 , 2026 | 05:58 AM
రక్త చరిత్రకు మారు పేరు వైఎస్ కుటుంబమని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. ‘జగన్ తాత రాజారెడ్డి నుంచి తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్ వరకు ఆ కుటుంబ రాజకీయ ప్రస్థానంరక్త చరిత్రతో...
వైసీపీ హయాంలో దళితులపై దమనకాండ సాగించిన విషయం జగన్ మర్చిపోయారా?: మంత్రి డోలా
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): రక్త చరిత్రకు మారు పేరు వైఎస్ కుటుంబమని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. ‘జగన్ తాత రాజారెడ్డి నుంచి తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్ వరకు ఆ కుటుంబ రాజకీయ ప్రస్థానంరక్త చరిత్రతో నిండిపోయింది. సొంత బాబాయిని దారుణంగా గొడ్డలితో చంపి జగన్ పెద్ద మనిషిలా మాట్లాడడం సిగ్గుచేటు. గత ఐదేళ్లు దళితులపై దమనకాండ సాగించిన విషయం జగన్ మర్చిపోయారా? డాక్టర్ సుధాకర్ నుంచి డాక్టర్ అచ్చన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతో మంది దళితుల్ని బలి తీసుకున్నారు. వైసీపీ నేతల ఇసుక మాఫియాని ప్రశ్నించిన పాపానికి రాజమండ్రిలో దళిత యువకుడికి శిరోముండనం చేశారు. ఇవన్నీ జగన్ మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు. జగన్ అరాచక, అసమర్థ పాలన వల్లే ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. బేలతనంతో ప్రభుత్వంపై జగన్ విషం చిమ్మడం సరికాదు’ అని మంత్రి డోలా అన్నారు.