వసతి గృహాలకు ప్రత్యేక నిధులు: డోలా
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:23 AM
రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేక నిధులు కేటాయించామని, ఈ ఏడాది బడ్జెట్‌లో కొత్త భవనాలతోపాటు మరమ్మతులకు కేటాయింపులు చేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేక నిధులు కేటాయించామని, ఈ ఏడాది బడ్జెట్‌లో కొత్త భవనాలతోపాటు మరమ్మతులకు కేటాయింపులు చేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో వసతి గృహాలకు నూతన భవనాల నిర్మాణంపై ఎమ్మెల్యే ధర్మరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని గురుకుల పాఠశాలల్లో ఫంక్షనరీ లిటరసీ అండ్ న్యూమరసీ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీల శ్మశాన వాటికలకు స్థల సేకరణ కోసం సర్వే నిర్వహించగా దాదాపు రూ.600 కోట్లు అవసరమని తేలిందని, దశల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. కాగా, నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో గత వైసీపీ హయాంలో జరిగిన వెయ్యి ఎకరాల భూకుంభకోణంపై విచారణ చేపట్టాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు అన్ని రకాలుగా అభివృద్ధికి దోహదపడే జీవో 3ను, 16 గిరిజన సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం నిలిపివేసిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు. వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.