Share News

సీమకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా..!

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:05 AM

అధికారంలో ఉన్న ఐదేళ్లు రాయలసీమను నిర్లక్ష్యం చేసిన జగన్‌ నేడు దీక్షల పేరుతో డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

సీమకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా..!

  • జగన్‌కు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సవాల్‌

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్న ఐదేళ్లు రాయలసీమను నిర్లక్ష్యం చేసిన జగన్‌ నేడు దీక్షల పేరుతో డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌... రాయలసీమకు ఎవరి హయాంలో ఏం చేశారన్న దానిపై అసెంబ్లీలో చర్చిద్దాం. అసెంబ్లీకి వచ్చి చర్చించే ధైర్యం ఉందా?’ అని మంత్రి సవాల్‌ విసిరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020లో జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే ఆగిపోయిందని, ఇదే విషయాన్ని జగన్‌ స్నేహితుడు, తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌ రావు స్వయంగా చెప్పారని అన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 03:05 AM