ఆర్‌అండ్‌బీ రోడ్లను పునరద్ధరిస్తాం: జనార్దన్ రెడ్డి
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:39 AM
రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బీ రోడ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బీ రోడ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, మాధవీరెడ్డి రోడ్ల అభివృద్ధిపై అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. మండపేట నియోజకవర్గంలో రోడ్ల పునరద్ధరణ, మరమ్మతులకు రూ.20 కోట్లు కేటాయించామని, మిగిలిన రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని అన్నారు. కడప ప్రధాన రోడ్లకు రూ.16.70 కోట్లతో పరిపాలన అనుమతుల ఇచ్చామన్నారు.