Share News

టారిఫ్‌ తగ్గింపుతో రాష్ట్రానికి ఉపశమనం: అచ్చెన్న

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:43 AM

భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా విధించిన టారిఫ్‌ను25 నుంచి 18శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు.

టారిఫ్‌ తగ్గింపుతో రాష్ట్రానికి ఉపశమనం: అచ్చెన్న

అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా విధించిన టారిఫ్‌ను25 నుంచి 18శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. టారిఫ్‌ తగ్గింపు వల్ల రాష్ట్రం నుంచి సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి పెద్ద ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. టారిఫ్‌ తగ్గించడంతో అమెరికా మార్కెట్‌లో భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల పోటీ గణనీయంగా మెరుగుపడుతుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పెరిగి, ఏపీ మత్స్య, ఆక్వా రంగం స్థిరమైన అభివృద్ధి సాధిస్తుందని మంత్రి అచ్చెన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 04 , 2026 | 05:43 AM