Share News

నాడు ఉద్యోగులపై అక్రమ కేసులు నిజమే: అనిత

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:12 AM

ప్రభుత్వ ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించడం లేదా ముగించడం అనేది ప్రభు త్వ నిర్ణయంతోనే కాదు.. చట్టపరమైన ప్రక్రియను అనుసరించి జరుగుతుంది...

నాడు ఉద్యోగులపై అక్రమ కేసులు నిజమే: అనిత

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించడం లేదా ముగించడం అనేది ప్రభు త్వ నిర్ణయంతోనే కాదు.. చట్టపరమైన ప్రక్రియను అనుసరించి జరుగుతుంది’ అని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిలో ప్రభుత్వ ఉద్యోగులపై అక్రమ కేసులపై టీడీపీ సభ్యుల ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ‘2019-24 మధ్య ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిన విషయం వాస్తవం. వాటి ఉపసంహరణకు తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అన్ని జిల్లా కోర్టుల్లో రెగ్యులర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు అదనంగా స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకాలు జరిగిన మాట వాస్తవం.’ అన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 04:12 AM